Site icon NTV Telugu

India vs New Zealand: ఫైనల్‌కు ముందు షాకింగ్ లెక్కలు.. టాస్ గెలిచిన టీమ్‌కే కప్పు?

India Vs New Zealand

India Vs New Zealand

India vs New Zealand: భారత్, న్యూజిలాండ్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ స్టేడియంలో ఓ షాకింగ్ స్టాట్స్ దాగి ఉన్నాయి. ఇక్కడ టాస్ గెలిచిన జట్లు అత్యధికంగా మ్యాచ్‌లు గెలిచాయి. గత సౌతాఫ్రికా vs భారత్ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు భారత్‌పై 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత జట్టు సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. 188 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సూర్య సైన్యం 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక్క శివమ్ దూబే(42) మాత్రమే చివరి వరకు పోరాడాడు. కానీ.. సరైన పాట్నర్ లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు.

READ MORE: Varalaxmi :అమ్మ, అక్క పాత్రలే ఇస్తారు.. పెళ్లి తర్వాత హీరోయిన్ల కష్టాలపై వరలక్ష్మి, ప్రియమణి బోల్డ్ కామెంట్స్..!

అయితే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 11 మ్యాచుల్లో గెలిచాయి. ఛేజింగ్ చేసిన జట్లు 5 సార్లు విజయం సాధించాయి. ఈ రిపోర్ట్స్ చూస్తే.. అహ్మదాబాద్‌లో టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే! అనిపిస్తోంది. ఇక ఈ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 173 కాగా, రెండో ఇన్నింగ్స్ సగటు 151 మాత్రమే ఉంది. భారత్ న్యూజిలాండ్‌పై చేసిన 234/4 అత్యధిక స్కోరు కాగా.. న్యూజిలాండ్ భారత్‌పై చేసిన 66 ఆలౌట్ కనిష్ట స్కోరుగా నిలిచింది. సౌతాఫ్రికా న్యూజిలాండ్‌పై చేసిన 178/3 అత్యధిక విజయవంతమైన ఛేజ్‌గా రికార్డు ఉంది. ఇక 107/7తో భారత్ మహిళలపై వెస్టిండీస్ మహిళలు కాపాడుకున్న స్కోరు అత్యల్ప డిఫెండెడ్ టోటల్‌గా ఉంది. ఇంతకీ.. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

READ MORE: India vs New Zealand: సెమీస్‌లో గెలిచిన ‘వ్యూహం’ ఫైనల్‌లోనూ రిపీట్.. గంభీర్ ప్లానింగ్ వర్కౌట్ అయితే ట్రోఫీ మనదే!

Exit mobile version