India vs New Zealand 4th ODI: మాన్యుగన్వేలోని బే ఓవల్ (Bay Oval) వేదికగా భారత్ (India) – న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య నేడు నాలుగో వన్డే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హామిల్టన్‌లో జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా.. ఈసారైనా ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి మ్యాచ్ చూడాలని ఇటు అభిమానులు, అటు రెండు జట్ల ఆటగాళ్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు వాతావరణం కూడా పూర్తిగా అనుకూలంగా ఉండటంతో ఫ్యాన్స్‌కు మంచి క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. తాము తొలుత ఫీల్డింగ్ (Bowling First) ఎంచుకున్నట్లు వెల్లడించాడు. “నిన్న పిచ్‌ను పరిశీలించినప్పుడు కాస్త గడ్డి ఉంది. కానీ ఇవాళ పిచ్ చాలా డ్రైగా కనిపిస్తోంది. అంతేకాకుండా సాయంత్రం వేళ వచ్చే మంచు (Evening Dew) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం” అని శ్రేయాస్ తెలిపాడు. శుభ్‌మన్ గిల్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడంపై స్పందిస్తూ.. “గతంలో ఆడిన మ్యాచ్‌లను విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం. మనకు పూర్తిస్థాయి మ్యాచ్‌లు దక్కకపోయినా.. మన ఆటతీరు, అప్రోచ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్‌ను మేము ఒక నాకౌట్ (Knockout) లాగానే భావిస్తున్నాం. రాబోయే రెండు మ్యాచ్‌లు చాలా కీలకం, ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి” అని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో రుతురాజ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.
మరోవైపు, తుది జట్టులో ఈ సారి ఏకంగా మూడు మార్పులు చేశారు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), కేఎల్ రాహుల్ (KL Rahul), అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) తదితరులు టెస్ట్ స్క్వాడ్ ప్రిపరేషన్స్ కోసం వెళ్లిపోయారు. ఫలితంగా, ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం లభించింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. అలాగే గత కొన్ని మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన మొహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా, ఆతిథ్య జట్టు తుది జట్టులో ఆరు మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌ను మీరు DD Sports ఛానెల్‌లో ఉచితంగా చూడవచ్చు.
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ (Teams Playing XI):
న్యూజిలాండ్ జట్టు: టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), విల్ యంగ్, నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఫిన్ అలెన్, మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ, మాథ్యూ ఫిషర్.
భారత జట్టు: రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నామన్ ధీర్, ఔకిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.

