Site icon NTV Telugu

India vs Ireland T20I Series: ఐపీఎల్ 2026 సన్నాహాల మధ్య టీమిండియా కొత్త టీ20 సిరీస్‌ ప్రకటన.. మ్యాచ్ లు జరిగేది అక్కడే..!

India Vs Ireland T20i Series

India Vs Ireland T20i Series

India vs Ireland T20I Series: టీమిండియా క్రికెటర్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ కోసం పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ హడావిడి మధ్యలో ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కు తోడుగా కొత్తగా మరో సిరీస్ విష్యం బయటకు వచ్చింది. తాజాగా టీమిండియా ఐర్లాండ్‌ తో ఆడబోయే కొత్త టీ20 సిరీస్‌కు సంబంధించి ప్రకటన వెలువడింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్ జూన్ నెల చివరి వారంలో జరగనుండగా, ఖచ్చితమైన తేదీలను త్వరలో బీసీసీఐ ప్రకటించనుంది. ముఖ్యంగా ఈ సిరీస్ ఇంగ్లండ్ పర్యటనకు ముందు జరగడం వల్ల టీమిండియాకు మంచి ప్రాక్టీస్ కానుంది.

Heat Stroke Warning Signs: వడదెబ్బ సంకేతాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..

ఈ సిరీస్‌ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌ ను ఎదుర్కొననుంది. ఇప్పటివరకు ఐర్లాండ్‌లో టీమిండియా 6 టీ20 మ్యాచ్‌ లు ఆడి అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మొత్తంగా చూస్తే భారత్, ఐర్లాండ్‌పై ఆడిన 8 మ్యాచ్‌ లలోనూ గెలిచింది. ఈ మ్యాచ్‌లు చాలా వరకు డబ్లిన్‌ లోని మలహైడ్ వేదికగా జరిగాయి. ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూలై 1 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మొత్తం 5 మ్యాచ్‌లు జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో జరగనున్నాయి. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డే జూలై 14న, రెండోది 16న, మూడోది 19న నిర్వహించనున్నారు.

Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు

Exit mobile version