Site icon NTV Telugu

END vs ENG: రవీంద్ర జడేజా ఓ జట్టులో.. కుల్దీప్ యాదవ్‌ మరో జట్టులో!

Jadeja Test

Jadeja Test

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ మరో వారం రోజుల్లో ఆరంభం కానుంది. లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్‌ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఎలా ఆడబోతుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్ట్‌లు ఆడిన టీమిండియా.. నేటి నుంచి నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. ఈ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నారు. రోజుకు 90 ఓవర్స్ పడుతాయి. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌ ఒక జట్టులో.. రవీంద్ర జడేజా మరో జట్టులో ఆడబోతున్నారు. విదేశాల్లో జట్టులోకి కొత్త బ్యాటర్స్ కోసం ఇద్దరిని వేర్వేరు జట్లలో ఆడిస్తున్నారు. దాంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్‌ దొరుకుతుందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

Also Read: Wimbledon 2025: భారీగా వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?

పేసర్లు ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలను ఈ వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్‌ పరీక్షించనుంది. ఇక ఆరు నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడనున్న పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్, ఫామ్‌కు ఈ మ్యాచ్‌ పెద్ద పరీక్ష. వెన్ను నొప్పి నుంచి కోలుకుని ఐపీఎల్ ఆడిన బుమ్రాతో ఎక్కువ స్పెల్స్‌ బౌలింగ్‌ చేయించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఐపీఎల్ 2025లో మహమ్మద్ సిరాజ్ రాణించడంతో భారీ అంచనాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డిలు బ్యాటర్లుగా ఆడనున్నారు. ఈ వార్మప్‌ మ్యాచ్‌లో బ్యాటర్‌ త్వరగా ఔటైతే.. అతడికి మరో అవకాశం ఇస్తారు.

Exit mobile version