Site icon NTV Telugu

Team India Playing XI: టీమిండియా-ఇంగ్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్.. సంజూ, అభిషేక్‌ జోడీకి పగ్గాలు.. భారత్ తుది జట్టు ఇదే!

Preview Wankhede

Preview Wankhede

Team India Playing XI: ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు చాలా ఉత్కంఠగా మారనుంది. రెండు జట్లు అత్యద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు కొన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జట్టు అద్భుతంగా తిరిగి వచ్చి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా వెస్టిండీస్‌పై సాధించిన గెలుపు జట్టుకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. దీంతో ఇప్పుడు సెమీఫైనల్ పోరుకు భారత్ పూర్తి ఉత్సాహంతో సిద్ధమవుతోంది.

READ MORE: Deputy CM Pawan Kalyan: రోడ్ల విస్తరణలో నరికే 100–140 ఏళ్ల నాటి పాత చెట్లకు ప్రత్యేక పాలసీ..

ఇక భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ విషయానికి వస్తే.. జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. బౌలింగ్ విభాగంలో ఒక నిర్ణయం మాత్రం మేనేజ్‌మెంట్ ముందుకు వచ్చింది. కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకురావాలి? అనే వాదనలను జట్టు పరిశీలిస్తోదట. కానీ.. ముంబై మైదానం స్వభావం దృష్ట్యా మరో స్పిన్ బౌలర్‌ను ఆడించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలోనూ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదట. ఈ మ్యాచ్‌లో ఎప్పటి లాగే సంజూ శామ్సన్‌, అభిషేక్‌కు ఓపెనింగ్ పగ్గాలు అప్పజెప్పనున్నారు. వెస్టిండీస్‌పై సంజు శాంసన్ అజేయంగా తొంభై ఏడు పరుగులు చేసి జట్టును విజయానికి తీసుకెళ్లాడు. మరోవైపు ఇటీవల కొన్ని నిరాశాజనక ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ ఈ కీలక మ్యాచ్‌లో తిరిగి తన ఫామ్‌ను అందుకోవాలని చూస్తున్నాడు. మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఐదో స్థానంలో తిలక్ వర్మ కొత్త బాధ్యతలో తన ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు జట్టులో కొనసాగనున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఎదుర్కోవాలంటే వీరు బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు సాధించి జట్టుకు మద్దతు ఇవ్వడం వీరి బాధ్యతగా ఉంటుంది. బౌలింగ్ విభాగంలో వేగ బౌలర్లుగా అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు ప్రధాన ఆయుధాలుగా ఉండనున్నారు. స్పిన్ బౌలింగ్ బాధ్యతను వరుణ్ చక్రవర్తి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ కూడా ఎంపికకు అవకాశం ఉన్నప్పటికీ మైదానం పరిస్థితులు దృష్ట్యా అతనికి తుది జట్టులో స్థానం దక్కుతుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది.

READ MORE: Heat waves: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు.. హడలెత్తిపోతున్న ప్రజలు

Exit mobile version