టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు జట్లు శ్రమిస్తున్నాయి. అయితే నేడు టీ20 వరల్డ్ కప్‌లో అడిలైడ్ వేదికగా భారత్‌తో ఇంగ్లాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 1.30 ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఆటగాళ్లు మొదట బ్యాటింగ్‌కు దిగనున్నారు. అయితే.. ఇప్పటికే సెమీస్ మ్యాచ్ దాయాది పాకిస్తాన్.. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా సైతం ఇంగ్లండ్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించి 2007 నాటి సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : Modi No Entry Flex: ప్రధాని తెలంగాణ పర్యటన.. దర్శనమిచ్చిన ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీ
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
ఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్
