Site icon NTV Telugu

Eng vs India : చాహల్‌ చమత్కారం.. 49 ఓవ‌ర్లలోనే ఇంగ్లండ్ ఆలౌట్‌

Chahal

Chahal

ఇంగ్లండ్‌-టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు రెండో మ్యాచ్‌ జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో పరాజయం పొందిన ఇంగ్లండ్‌ జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు గట్టిగానే ప్రయత్నించింది. అయినప్పటికీ టీమిండ్‌ బౌలర్ల దాటికి 49 ఓవర్లకే ఇంగ్లండ్‌ జట్టు ఆలౌట్‌ అయ్యింది. అయితే తొలి వన్డేలో బుమ్రా ఇంగ్లండ్‌ ఆటగాళ్లను కట్టిచేయగా.. ఈ మ్యాచ్‌లో యజువేంద్ర చాహల్‌ విజృంభించాడు. తన బౌలింగ్‌ ప్రతిభతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లను తప్పుదారిపట్టించి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

49 ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 246 ప‌రుగులు చేసి వెనుదిరిగింది. అయితే మరికాసేపట్లో 247 పరుగుల లక్ష్యంతో టీమిండియా రంగంలోకి దిగనుంది. అయితే ఈ సిరీస్‌ కంటే ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌నైనా ఇంగ్లండ్‌ గెలువాలనే లక్ష్యంతో ఉంది. చూడాలి మరీ.. సిరీస్‌ ఎవరి ఖాతాలో పడుతుందోనని.

 

Exit mobile version