IND vs ENG 4th test: తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్‌

Ind Vs Eng

Ind Vs Eng

India Vs England 4th Test: రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరూట్ (122*) శతకం చేయగా.. రాబిన్సన్ (58) అర్థ శతకం, బెన్‌ ఫోక్స్‌ (47), జాక్‌ క్రాలే (42), బెయిర్‌ స్టో (38) పరుగులు చేశారు. ఇక, టీమిండియా బౌలర్లలో ర‌వీంద్ర జ‌డేజా నాలుగు వికెట్లు, ఆకాశ్‌దీప్ 3 వికెట్లు తీసుకోగా.. మహ్మద్ సిరాజ్ 2 రెండు వికెట్లు పడగొట్టగా ర‌విచంద్రన్ అశ్విన్ ఒక్క వికెట్ తీసుకున్నాడు. అయితే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 302 రన్స్ చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుంది.

Read Also: RBI : విదేశీ మారకద్రవ్యంలో భారత్ రికార్డులు..11 నెలల్లో ఖజానాలోకి రూ.4 లక్షల కోట్లు

కాగా, అంతకుముందు.. రవీంద్ర జ‌డేజా విజృంభించడంతో ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 103వ ఓవ‌ర్ వేసిన జ‌డేజా మొద‌టి బంతికి రాబిన్సన్(58)ను అవుట్ చేయడంతో నాలుగో బంతికి షోయ‌బ్ బ‌షీర్ (0)ను డగౌట్ కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 102.4వ ఓవ‌ర్‌లో 349 రన్స్ కే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న రాబిన్సన్ బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.. కానీ, చివరికి జ‌డేజా బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. టెస్టుల్లో రాబిన్సన్ కు ఇదే తొలి హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. అలాగే, భారత్ తరపున డెబ్యూ చేసిన మ్యాచ్ లోనే మూడు వికెట్లను ఆకాశ్ దీప్ సైతం తీసుకున్నాడు.