India vs England 2nd ODI: కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్‌లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇటు మోకాలి నొప్పి వల్ల అనూహ్యంగా నాగ్‌పుర్ మ్యాచ్‌కు దూరమయ్యాడు కోహ్లీ. కానీ గాయం మరీ ఇబ్బందికరమైందేమీ కాదని స్పష్టం చేశాడు టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్. దీంతో ఈ మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, శుభ్ మన్‌గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ రైజ్ అండ్ ఫాల్..! అవినీతికి వ్యతిరేకం అని.. అదే ఊబిలో కూరుకుపోయి..!