Pink Ball Test: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సత్తా చాటుతుందా? నేటి నుంచే ఏకైక పింక్ బాల్ టెస్ట్!
- అడిలైడ్ వేదికగా నేటి నుంచి భారత్ – ఆస్ట్రేలియా మహిళల మధ్య ఏకైక పింక్ బాల్ టెస్ట్
- వన్డే సిరీస్ ఓటమి తర్వాత టెస్టులో గెలవాలని భారత్ పట్టుదల
- ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pink Ball Test: భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా నేటి నుంచి ఏకైక పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయిన కసి మీద ఉన్న భారత్.. ఈ టెస్టులో గెలవాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీనితో భారత్ ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
Divvela Madhuri: తప్పు మీద తప్పు.. కేక్ కటింగ్ ఘటనతో దివ్వెల మాధురి మళ్లీ రచ్చ..!
Also Read
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ఛాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం భారత్ వద్ద 4 పాయింట్లు మాత్రమే ఉండగా.. ఈ టెస్టులో గెలిస్తే వచ్చే 4 పాయింట్లతో భారత్ 8-8తో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను ఆస్ట్రేలియాతో పంచుకునే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ‘డ్రా’ అయితే మాత్రం ట్రోఫీ ఆతిథ్య జట్టుకే దక్కుతుంది. ప్రస్తుతం టీంఇండియాకు ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్. ఆమె తోపాటు జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంది. ఆల్ రౌండర్ దీప్తి శర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్‌లు లోయర్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే.. స్నేహ రాణా, క్రాంతి గౌడ్, సయాలీ మరియు కాశ్వీ గౌతమ్ వంటి బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయాల్సి ఉంటుంది.
మరోవైపు పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియాకు అపారమైన అనుభవం ఉంది. ఇప్పటివరకు జరిగిన మూడు డే-నైట్ టెస్టులు కూడా ఆసీస్ గడ్డపైనే జరిగాయి. అలీసా హీలీ నేతృత్వంలోని జట్టు తన సొంతగడ్డపై అత్యంత ప్రమాదకరంగా ఆడుతుంది. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు కెప్టెన్ అలీసా హీలీ వీడ్కోలు పలకనుంది. దీనితో గెలుపుతో వీడ్కోలు పలకాలని ఆసీస్ బృందం భావిస్తోంది.
Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!
తుది జట్లు (అంచనా):
భారత్: హర్మన్‌ప్రీత్ (C), స్మృతి మంధాన, ప్రతీక, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, సయాలీ/అమన్‌జోత్, కాశ్వీ గౌతమ్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్.
ఆస్ట్రేలియా: అలీసా హీలీ (C), ఫోబీ లిచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, యాష్లీ గార్డనర్, తాలియా మెక్‌గ్రాత్, అనాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, డార్సీ బ్రౌన్, లూసీ హామిల్టన్, జార్జియా వోల్.
తాజావార్తలు
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!