NTV Telugu Site icon

IND VS AUS 1st T20: ఆసీస్- భారత్ మ్యాచ్ కి వరుణ గండం

Ind Vs Aus

Ind Vs Aus

విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా విశాఖలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది. మ్యాచ్‌ జరిగే సమయానికి వర్షం పడే ఛాన్స్ ఉండటంతో టాస్‌ ఆలస్యం అవుతుందని స్థానికులు అంటున్నారు. ఇక, వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోయినప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉందనే టాక్.

Read Also: Bigg Boss7 Telugu : బిగ్ బ్రేకింగ్.. హౌస్ లో అమర్ దీప్ కు అస్వస్థత.. ట్రీట్మెంట్ కోసమే..

కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో ఈ సిరీస్‌లో యంగ్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా క్రికెటర్లు.. విశాఖలో జరిగే టీ20లో ఆసీస్‌ను ఓడించాలని టీమిండియా యంగ్ స్టార్ట్ పట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్‌ కోసం​ ఆస్ట్రేలియా సైతం కొందరు ముఖ్యమైన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చింది. వరల్డ్‌కప్‌ అనంతరం కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, మార్ష్‌ స్వదేశానికి వెళ్లిపోయారు. ఇక, ఈ సిరీస్‌లో మాథ్యూ వేడ్‌ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్‌, ట్రవిస్‌ హెడ్‌, ఆడమ్‌ జంపా దూరంగా ఉంటున్నారు.