AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..

India Vs Afghanistan

India Vs Afghanistan

India vs Afghanistan T20: నేటి నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్‌ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఉత్కంఠభరిత పోరు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను భారత అభిమానులు టీవీల్లో ‘సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్’ ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూడాలనుకునే వారు ‘ఫ్యాన్‌కోడ్’ (FanCode) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఇక, ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ముఖాముఖి సమరాల్లో టీమిండియాదే స్పష్టమైన పైచేయిగా నిలిచింది. పాత రికార్డులను పరిశీలిస్తే, ఇరు జట్ల మధ్య జరిగిన 9 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 8 విజయాలు సాధించగా, ఒక్క మ్యాచ్ మాత్రమే ఫలితం తేలకుండా ముగిసింది.

ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. వర్షం వల్ల నెట్స్ ప్రాక్టీస్ కాస్త ఆలస్యమైనప్పటికీ, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలోకి దిగి పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ వేశాడు. గతంలో ఐపీఎల్‌లో తన బౌలింగ్‌లోనే భారీ సిక్సర్ బాదిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో బుమ్రా తలపడిన తీరు క్రికెట్ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపింది. తొలి టీ20 మ్యాచ్‌కు ముందు బుమ్రాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి రావడం భారత్‌కు పెద్ద బలంగా మారింది. అయితే, ఇంకా ముగింపునకు రాని భారత్ టాప్ ఆర్డర్ సమస్యను చక్కదిద్దుకోవడమే టీమిండియా ముందున్న ప్రధాన సవాలు.

ఈ సిరీస్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో ప్రధానాంశం ఆఫ్ఘనిస్థాన్‌ ఎదుగుదల. ఒకప్పుడు తమ సొంత మ్యాచ్‌లను ఆడుకోవడానికి భారత మైదానాలపైనే ఆధారపడిన ఆఫ్గాన్, తమ తొలి టెస్టును కూడా బెంగళూరులోనే భారత్‌పై ఆడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చరిత్రలో తొలిసారిగా భారత్‌తో ఒక ద్వైపాక్షిక సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ అధికారికంగా ఆతిథ్యం ఇస్తోంది. ఐపీఎల్ ద్వారా భారత పిచ్‌లపై అపారమైన అనుభవం గడించిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, రెహ్మానుల్లా గుర్బాజ్ వంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అంతేకాకుండా, 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇదే ఢిల్లీ మైదానంలో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఘనమైన ట్రాక్ రికార్డు కూడా వారి సొంతం. ఇబ్రహీం జద్రాన్ సారథ్యంలో, రషీద్, నబీ, నూర్ అహ్మద్ వంటి ప్రమాదకరమైన స్పిన్ దళంతో దిగుతున్న ఆఫ్ఘనిస్థాన్‌‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం.

ఇక మైదానంలోకి అడుగుపెట్టడానికి ముందు టీమ్‌ఇండియాను పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఓపెనింగ్‌లో ఏ ఇద్దరిని ఆడించాలన్నది తేల్చుకోవడం కష్టంగా మారింది. గతంలో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీని కొన్ని మ్యాచ్‌లకు దూరం పెడితే తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సంజు శామ్సన్‌ను పక్కనపెట్టి వైభవ్‌ను ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో ఆడించారు. కానీ ఆ మ్యాచ్‌లో బుడ్డోడు తడబడ్డాడు. దీంతో సంజుకు అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఇక జింబాబ్వే పర్యటన నుంచి సంజుకు విశ్రాంతినిచ్చి, వైభవ్‌ను కొనసాగిస్తే.. అతను సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులో ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరినీ ఆడించి అభిషేక్‌ శర్మను పక్కన పెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తారేమో చూడాలి. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కొక్కరిని పక్కన పెట్టి.. తలో రెండు మ్యాచ్‌లు ఆడించే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ సిరీస్‌కు సంబంధించి తుది జట్లు అంచనాలను చూద్దాం..

భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికె) or వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికె), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి.

ఆఫ్ఘనిస్థాన్‌: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), దర్విష్ రసూలీ, నూర్ ఉల్ రహ్మాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికె), సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, నంగెలియా ఖరోటే, అబ్దుల్లా ఎఫ్ అమ్హద్జాయ్, ఎఫ్. నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహమాన్, నూర్ అహ్మద్.