Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓపెనర్ రహ్మానుల్లా గుబాజ్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బాదిన్ నైబ్ (2), దర్విష్ రసూలి (2), రషీద్ ఖాన్ (1), నూర్ అహ్మద్ (0) తీవ్రంగా నిరాశపరిచారు. సెదిఉల్లా అటల్ 13 పరుగులు చేశాడు.
స్కోరు బోర్డు కష్టాల్లో ఉన్న సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుత పోరాటం కనబరిచాడు. ఒమర్జాయ్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా మొహమ్మద్ నబీ 27 బంతుల్లో 33 పరుగులు జోడించగా, చివరిలో ముజీబ్ ఉర్ రెహమాన్ 3 బంతుల్లో 9* పరుగులు చేసి స్కోరును 156కి చేర్చారు.
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
భారత బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 1 వికెట్ తీయగా, నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లలో కేవలం 3 పరుగులిచ్చి ఆకట్టుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. ఎక్స్‌ట్రాస్ రూపంలో ఆఫ్ఘనిస్తాన్‌కు 21 పరుగులు వచ్చాయి. ఇప్పుడు భారత్ 157 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగనుంది.
తాజావార్తలు
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!