Site icon NTV Telugu

India Tour to England: భారత్-ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్‌ విడుదల..

Ind Vs Eng

Ind Vs Eng

వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) భారత్ తో ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వచ్చే ఏడాది జూన్, ఆగస్టు మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అదే సమయంలో.. భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటుంది. ఉమెన్స్ జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ఆడనుంది.

Read Also: Kolkata doctor case: బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన.. న్యాయం చేయాలని డిమాండ్

భారత పురుషుల జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ఆగస్టు 4 వరకు జరగనుంది. అలాగే.. భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జూన్ 28 నుండి జూలై 12 వరకు జరుగనుంది. ఆ తర్వాత.. భారత మహిళల క్రికెట్ జట్టు జూలై 16-జూలై 22 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌ను కూడా ఆడనుంది. భారత్ vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే.. మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుండి 24 మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతుంది. ఆ తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై 2 నుండి 6 మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతుంది.

Read Also: Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కుప్పకూలుతున్న జనాలు

మూడో టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని చివరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ జూలై 31 మరియు ఆగస్టు 4 మధ్య లండన్‌లోని కియా ఓవల్ మైదానంలో జరుగుతుంది.

Exit mobile version