India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. తాజాగా ఈ రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాపం శుభ్మన్ గిల్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. వరల్డ్‌కప్ పోరు 2026 ఫిబ్రవరి 7న స్టార్ట్ అయ్యి- మార్చి 8న తుది పోరు జరగనుంది.
READ ALSO: Pawan Kalyan: విభజన తర్వాత పదేళ్లు నలిగిపోయాం.. తెలుగు జాతి కోసం కూటమిగా ఏకమయ్యాం..
ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న ఫస్ట్ సెమీ ఫైనల్, మార్చి 5న సెకండ్ సెమీ ఫైనల్ ఉండనుంది. గ్రూప్ స్టేజిలో టీమిండియా ఫిబ్రవరి 7న యూఎస్ఏతో తొలి పోరుకు సిద్ధం అవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న భారత్ నమీబియాతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా – పాకిస్థాన్ మధ్య సమరం ఉండనుంది. అనంతరం ఫిబ్రవరి 18న టీన్ఇండియా నెదర్లాండ్‌తో తలపడనుంది.
ఇదే భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), బుమ్రా.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025
READ ALSO: PM Modi: టీఎంసీ అభివృద్ధిని అడ్డుకోవద్దు.. బెంగాల్ ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగించిన మోడీ
