Team India Missing Players: ఇండియన్ క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ రోజు అజిత్ అగార్కర్ అధ్యక్షతన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. గుర్తు ఉంది కదా.. టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు మూడోసారి టైటిల్‌ను ముద్దాడటానికి సిద్ధం అవుతుంది. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి మైదానంలోకి దిగే భారత జట్టు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారత జట్టులో లేని గత టీ20 ప్రపంచ కప్ విజయానికి చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఆ ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
READ ALSO: Tadepalli: తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ దగ్గర కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలు!
రోహిత్ శర్మ
ప్రస్తుతం ప్రకటించిన జట్టులో కనిపించని మొదటి పేరు.. క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే హిట్‌మ్యాన్‌ది. రోహిత్ శర్మ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో టీం ఇండియాకు నాయకత్వం వహించాడు. ఈ స్టార్ క్రికెటర్ కెప్టెన్సీలో భారత జట్టు రెండోసారి టైటిల్ గెలుచుకుంది. గత ఏడాది టీమిండియా ఛాంపియన్‌గా అవరించిన తర్వాత రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అందుకే ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో రోహిత్ శర్మ పేరు కనిపించలేదు.
విరాట్ కోహ్లీ
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లాగానే, కింగ్ విరాట్ కోహ్లీ కూడా T20 ప్రపంచ కప్ తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 T20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ టీమిండియాను విజయపథంలో నడిపిన విషయాన్ని మర్చిపోలేం. ఆ టైంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కింగ్ 76 పరుగుల ఇన్నింగ్స్ చిరస్మరణీయమైనదిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. కానీ ఇప్పుడు కింగ్ కోహ్లీ పేరు తాజాగా ప్రకటించిన భారత జట్టు జాబితాలో చేర్చడలేదు. ఈ మెగా టోర్నీలో కచ్చితంగా అభిమానులు కింగ్ కోహ్లీ- హిట్‌మ్యాన్ రోహిత్‌లను మిస్ అవుతారు.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా.. టీమిండియా తరుఫున ఎన్నో అద్భుతమైన విజయాలలో భాగం అయిన స్టార్ ప్లేయర్. గత ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను భారత్ ముద్దాడిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత, రవీంద్ర జడేజా కూడా ఈ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో ఈ స్టార్ పేరు చేర్చలేదు.
యుజ్వేంద్ర చాహల్
2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో యుజ్వేంద్ర చాహల్ పేరు కూడా లేదు. గత టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో చాహల్ ఉన్నాడు. ఈ ప్లేయర్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా, జట్టులో మాత్రం ఉన్నాడు. ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టులో చాహల్ పేరు లేదు.
యశస్వి జైస్వాల్
2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో లేని ఐదవ పేరు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ది. 2024 టీ20 ప్రపంచ కప్ కోసం బరిలోకి దిగిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ యువ ప్లేయర్‌కు మైదానంలోకి దిగి ఆడే అవకాశం రాలేదు. కానీ ప్రస్తుతం ప్రకటించిన 2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో జైస్వాల్ పేరు లేదు.
READ ALSO: HYDRA Lake Restoration: చారిత్రక చెరువుకు హైడ్రా పునర్జన్మ..
