NTV Telugu Site icon

India Maldives Row: మాల్దీవుల రాయబారిని పిలిచిన భారత ప్రభుత్వం

Maldives

Maldives

ఇవాళ ఉదయం భారత్-మాల్దీవుల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మాల్దీవుల రాయబారిని పిలిపించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌ను పిలిపించింది. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా.. మాల్దీవులకు సంబంధించిన పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై వివరణ తీసుకునే అవకాశం ఉంది.

Read Also: Rafael Nadal: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న రాఫెల్ నాదల్‌!

కాగా, ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం గట్టి వైఖరి ప్రదర్శిస్తుంది. దీంతో ఆగ్రహించిన దాదాపు నాలుగు వేల మంది భారతీయులు మాల్దీవుల్లో హోటల్ బుకింగ్స్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటికే మూడు వేల విమాన టిక్కెట్లు రద్దయ్యాయి. భారత హైకమిషనర్ కూడా మాల్దీవుల ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. భారతదేశం యొక్క కఠినమైన వైఖరితో మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు డిప్యూటీ మంత్రులు షియునా, మల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్‌లను సస్పెండ్ చేసింది. ప్రపంచంలోనే ఒక దేశానికి చెందిన మంత్రులను మరో దేశ నాయకుడిపై వ్యాఖ్యలు చేయడంతో సస్పెండ్ కావడం ఇదే తొలిసారి అని నిపుణులు అంటున్నారు.

Read Also: BJP: నేడు బీజేపీ కీలక సమావేశాలు.. శాసన సభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం..!

ఇక, మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు పలువురు మంత్రులు, అధికారులు చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసిన వాటిని సమర్థించడం లేదు.. కాగా భారత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెమ్మదిగా దిగి వచ్చి విమర్శలు చేసింది వారి సొంత ఆలోచన మాత్రమే మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని మా ప్రభుత్వం విశ్వసిస్తుంది.. ఇది ద్వేషాన్ని, ప్రతికూలతను వ్యాప్తి చేయకూడదు.. అలాగే, మరే ఇతర దేశాలతో మాల్దీవుల సంబంధాలను ప్రభావితం చేయకూడదు అని చెప్పుకొచ్చింది.