Iran Attack On Indian Ships: భారత్ నౌకలపై దాడి.. ఇరాన్ రాయబారికి భారత్ సీరియస్ వార్నింగ్..
- భారత నౌకలపై దాడి చేసిన ఇరాన్..
- తీవ్రంగా స్పందించిన ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై చర్చించేందుకు న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారిని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ సాయంత్రం పిలిపించింది. భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి సదరు రాయబారితో భేటీ అయ్యి, ఈ కాల్పుల ఘటన పట్ల భారతదేశం తరపున తన తీవ్ర ఆందోళనను , నిరసనను వ్యక్తం చేశారు.
సముద్ర మార్గంలో ప్రయాణించే వణిజ్య నౌకల భద్రత, అలాగే అందులో పనిచేసే సిబ్బంది క్షేమం తమకు అత్యంత ముఖ్యమని భారత్ స్పష్టం చేసింది. గతంలో భారత్‌కు వచ్చే నౌకలకు సురక్షితమైన దారిని కల్పించడంలో ఇరాన్ సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు జరిగిన కాల్పుల ఘటన చాలా తీవ్రమైనదని, దీనిపై ఇరాన్ ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కోరారు.
Also Read
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
Our statement regarding Iran ⬇️
🔗 https://t.co/05hycXPgJ6 pic.twitter.com/HwhqdNL9M8
— Randhir Jaiswal (@MEAIndia) April 18, 2026
భారతదేశానికి చెందిన నౌకలు ఎలాంటి ఆటంకం లేకుండా, సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని ఇరాన్ అధికారులకు తెలియజేయాలని రాయబారిని భారత్ కోరింది. భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన ఈ ఆందోళనలను, అభ్యర్థనలను తమ దేశ అధికారులకు ఖచ్చితంగా చేరవేస్తానని ఇరాన్ రాయబారి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సముద్ర రవాణాలో శాంతిని నెలకొల్పేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది.
తాజావార్తలు
-
PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?