Site icon NTV Telugu

Asia Cup 2023: ఓపెనర్లుగా గిల్‌, ఇషాన్‌.. నాలుగో స్థానంలో రోహిత్‌! తుది జట్టు ఇదే

Team India

Team India

India Playing 11 against Pakistan Match for Asia Cup 2023: పాకిస్తాన్‌, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్‌ 2023 మొదలుకానుంది. పాకిస్తాన్, నేపాల్‌ జట్ల మధ్య పోరుతో ఈ ఈవెంట్‌ ఆరంభం కానుంది. సెప్టెంబరు 2న శ్రీలంకలోని పల్లెకెలెలో పాకిస్తాన్‌, భారత్ మ్యాచ్‌ జరగనుంది. ​ఈ వన్డే టోర్నీ కోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ తుది జట్టు ఎలా ఉండనుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇందుకు కారణం స్టార్ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇవ్వడమే.

మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో భారత్ గత కొన్నేళ్లుగా సమస్య ఎదుర్కొంటోందని కెప్టెన్ రోహిత్‌ శర్మ ఇదివరకే అంగీకరించాడు. కొన్నాళ్లుగా నాలుగులో శ్రేయస్‌ అయ్యర్‌ నంబర్‌ 4లో రాణిస్తున్నా.. గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరం కావడం ప్రభావం చూపింది. ప్రపంచకప్ 2023 ముందు అయ్యర్‌కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా మేనేజ్మెంట్‌లో నెలకొంది. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నాటికి కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేకుంటే.. ఇషన్‌ కిషాన్‌కు జట్టులో చోటు ఖాయం. అయితే అతడిని ఏ స్థానంలో ఆడించాలన్నదే ఇప్పుడు ప్రశ్న.

వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మకు జోడీగా శుబ్‌మన్‌ గిల్‌ స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అయితే కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేకుంటే.. గిల్‌, ఇషాన్‌లతో ఓపెనింగ్‌ చేయించి.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీని దించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ భావిస్తోందట. నాలుగో స్థానంలో రోహిత్‌ ఆడతాడు. ఓపెనర్‌గా వన్డేల్లో ఇషాన్‌కు మంచి రికార్డు ఉన్నా కారణంగానే మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుందట. సీనియర్ రోహిత్ ఎక్కడైనా ఆడుతాడు కాబట్టే ఇషాన్‌కు ప్రమోషన్ దక్కనుందట. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ను ఐదో స్థానానికి డిమోట్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయ్యర్‌ నాలుగులో ఆడి.. రోహిత్ 5వ స్థానంలో ఆడినా ఆశ్చర్యం లేదు. ఆపై హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలు ఆల్‌రౌండర్‌ కోటాలో ఆడతారు. బౌలర్లుగా కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ ఆడతారు.

Also Read: Gold Today Price: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎలా ఉన్నందంటే?

భారత జట్టు (అంచనా):
ఇషాన్‌ కిషాన్‌, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌.

Exit mobile version