Site icon NTV Telugu

పన్నూన్ హత్యకు కుట్ర పన్నారనే అమెరికా మీడియా కథనంపై భారత్ ఆగ్రహం

Pannu

Pannu

అమెరికాలో నివసిస్తున్న ఖలిస్తానీ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కుట్రలో భారత అధికారులు పొల్గొన్నట్లు.. అలాగే, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలో భారతీయ ఏజెంట్లు హత్య చేశారంటూ అమెరికా వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఆరోపించింది. ఈ కుట్ర మొత్తం మాజీ సీఆర్పీఎఫ్ అధికారి ద్వారానే జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రపై భారత ప్రభుత్వం స్పందించింది. ఇంత తీవ్రమైన అంశంలో నిరాధారమైన నివేదిక ప్రచురించబడిందని భారతదేశం చెప్పుకొచ్చింది.

Read Also: Shah Rukh Khan-Ganguly: సౌరవ్ గంగూలీని ఆశ్చర్యపరిచిన షారుఖ్.. వీడియో వైరల్!

కాగా, దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటన చేశారు. ఈ నివేదికలో అసమంజసమైన విషయాలు చెప్పారు.. అందులో ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. దీనిపై అమెరికా ఇప్పటికే మాట్లాడిందని, దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు కొనసాగిస్తుంది., అమెరికా ఇచ్చిన ఆ ఇన్‌పుట్‌లను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైన ఊహాగానాలు చేయడం.. బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం సరికాదన్నారు.

Exit mobile version