NTV Telugu Site icon

Covid-19 : భారత్ లో భారీగా కరోనా.. 24 గంటల్లో 3,823 కేసులు

Covid Cases

Covid Cases

భారతదేశంలో గత 24 గంటల్లో 3 వేల 823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 27 శాతం పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ లో నిన్న 2 వేల 994 ఉండగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య 16 వేల 354 కి పెరిగాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read : IPL 2023 : ఉప్పల్ లో హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్.. ఫ్యాన్స్ హంగామా

భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసులు గతంలో కంటే ఇవాళ్టితో పోలిస్తే 27% పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 3,824 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిందని తెలిపింది. శుక్రవారం, దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు 3,095.. శనివారం 2995 వద్ద ఉంది. ఇంతలోనే కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతుంది. మొత్తం యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 18 వేల 389కు పెరిగింది. వైరస్ బారిన పడిన వారు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.04% (4,47,22,605). మరోవైపు, రికవరీల సంఖ్య 4,41,73,335 (98.77%)కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 5,30,881 మంది ప్రాణాలు (1.19%) కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read : Costume Krishna: సీనియర్‌ నటుడు కాస్ట్యూమ్‌ కృష్ణ ఇకలేరు..

కరోనా టీకా విషయానికొస్తే, రెండు సంవత్సరాల క్రితం జనవరి 16న ప్రారంభమైన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 2.2 బిలియన్ల కంటే ఎక్కువ మందికి కోవిడ్-19 వ్యాక్సిన్‌లు వేశారు. ఇందులో గత 24 గంటల్లో 2,799 డోస్‌లు ఇవ్వబడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Show comments