Site icon NTV Telugu

Corona Cases: భారత్‌లో 257 కరోనా కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే?

Corona

Corona

దేశంలో మరోసారి కరోనా భయం పుట్టుకొస్తోంది. కేసులు రోజు రోజుకూ స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎలాంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తోందో అని భయపడుతున్నారు. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సమాచారం వెల్లడించింది. దేశంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

READ MORE: Jananayagan : జననాయగన్ ట్విస్ట్.. ఒక ఎపిసోడ్ కోసమే 4.5 కోట్లు

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన తాజాగా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్ష అనంతరం ఈ ప్రకటన వెలువడింది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైందని ఆయా వర్గాలు తెలిపాయి.

READ MORE: Nellore Chepala Pulusu: ఇంట్లోనే అదిరిపోయే నెల్లూరు చేపల పులుసు చేసుకుందాం రండి..

Exit mobile version