సరదాగా నవ్వుతూ, సంతోషంగా పనిచేసుకుంటూ ఉన్నట్టుండి చాలా మంది కుప్పకూలిపోతున్నారు.
ఈ వ్యక్తులు ఇలా అర్ధాంతరంగా చనిపోవడానికి ప్రధాన కారణం గుండెపోటు అని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.
గుండెపోటు తీవ్రమైన ఛాతీ నొప్పితో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగని అందరికీ ఒకే లక్షణాలు ఉండవని, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయని అంటున్నారు.
కొన్ని అనారోగ్య కారణాల వల్ల వికారంగా అనిపించవచ్చు. కానీ గుండెపోటు ప్రారంభ సంకేతాల్లో ఇదీ ఒకటి.
విశ్రాంతి సమయంలో లేదా తక్కువ శారీరక శ్రమతో ఊపిరి ఆడకపోవడం అనేది అంతర్లీన గుండె సమస్యను సూచిస్తుందట.
ఎటువంటి కారణం లేకుండా విపరీతమైన చెమట, చర్మంపై తడి అనుభూతి ఉంటే హార్ట్ ఎటాక్ లక్షణాల్లో ఒకటి కావచ్చు.
అకస్మాత్తుగా తీవ్రమైన బలహీనత అనేది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక అని నిపుణులు పేర్కొన్నారు.
వివరించలేని అలసట అనేది రాబోయే గుండెపోటుకు హెచ్చరిక సంకేతం కావచ్చట.