Site icon NTV Telugu

Sofia Qureshi : పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తున్నాం.. పాక్‌ ఎయిర్‌ బేస్‌లను లేపేసాం

Khureshi

Khureshi

India Pak War: పాకిస్తాన్ తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూ భారత సరిహద్దుల్లో రెచ్చగొట్టే దాడులకు తెగబడుతోంది. గురువారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్ జెట్లతో దాడులకు ప్రయత్నించింది పాక్‌. ముఖ్యంగా శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ విమానాలు చొచ్చుకురావడానికి ప్రయత్నించాయని భారత సైన్యం వెల్లడించింది. ఈ మేరకు కల్నల్ సోఫియా ఖురేషి తాజాగా వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో దాడులు చేస్తోందని ఆమె తెలిపారు. అయితే భారత సైన్యం వారి చర్యలను అంతే సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Omar Abdulla : శాంతిని కోరుకుంటున్నారా..? అయితే IMF సాయం ఆపండి.. ఒమర్ ఆగ్రహం..

పాకిస్తాన్ నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందరి ఆమె వెల్లడించారు. గురువారం రాత్రి వారు ఏకంగా 24 చోట్ల మన వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించారని, శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వంటి కీలకమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు. కానీ భారత సైన్యం వారికి గట్టి జవాబు ఇస్తోందని కల్నల్ సోఫియా ఖురేషి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లపైనా భారత్ ప్రతిదాడులు చేసిందని, భారత్ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోందన్నారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నామని, S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేసిందని సోఫియా ఖురేషి పేర్కొన్నారు.

పాకిస్తాన్ ఈ వరుస దాడులు ప్రాంతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉంటూ శత్రువుల ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేస్తోంది. కల్నల్ సోఫియా ఖురేషి మాటలను బట్టి చూస్తే, భారత రక్షణ వ్యవస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పాకిస్తాన్ ఈ దుస్సాహసాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆమె హెచ్చరించారు.

భారత వైమానిక దళం కూడా పాకిస్తాన్ ఫైటర్ జెట్లను సమర్థవంతంగా అడ్డుకుందని తెలుస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా భారత సైన్యం చురుగ్గా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా శాంతంగా ఉండాలని, అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని అధికారులు సూచిస్తున్నారు.

Gold Rates: యుద్ధం వేళ వణికిస్తున్న బంగారం ధరలు.. ఇవాళ తులం గోల్డ్ ధర ఎంత పెరిగిందంటే?

Exit mobile version