NTV Telugu Site icon

T20 World Cup: టీమిండియా ప్లేయర్‌కు ఐసీసీ షాక్.. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత

Arundhati Reddy

Arundhati Reddy

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్ లో భాగంగా.. నిన్న భారత్-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డిని ఐసీసీ మందలించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు అరుంధతి దోషిగా తేలింది. “అంతర్జాతీయ మ్యాచ్‌లో అతని/ఆమె అవుట్ చేసినప్పుడు బౌలర్ నుండి దూకుడుగా స్పందించే లేదా అవమానపరిచే, దూకుడుగా స్పందించే భాష, చర్యలు లేదా సంజ్ఞలను ఉపయోగించడం” కోసం ఆర్టికల్ 2.5ను ఉపయోగిస్తారు.

Read Also: CM Revanth Reddy : మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్దతు ఇవ్వండి… కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ విన‌తి

మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో నిదా దార్‌ని అవుట్ చేసిన తర్వాత అరుంధతి రెడ్డి.. బ్యాటర్‌ను పెవిలియన్ వైపు సైగ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 3/19తో అద్భుతమైన బౌలింగ్‌తో అబ్బురపరిచిన అరుంధతి రెడ్డి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. అరుంధతి రెడ్డి ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఒక-డిమెరిట్ పాయింట్ పెనాల్టీని విధించింది. 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పు ఇది. మైదానంలోని అంపైర్లు, థర్డ్ అంపైర్ ఈ ఘటనను చూసి ఆమెపై అభియోగాలు మోపారు. అరుంధతి రెడ్డి కూడా ఈ తప్పును అంగీకరించింది. లెవల్ 1 ఉల్లంఘనలకు డీమెరిట్ పాయింట్లతో పాటు అధికారిక మందలింపు నుండి మ్యాచ్ ఫీజులో 50 శాతం తగ్గింపు వరకు జరిమానా ఉంటుంది. కాగా.. టీమిండియా ఉమెన్స్ జట్టు అక్టోబర్ 9న శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Read Also: Ka Movie: ‘మాస్ జాతర’ సాంగ్ అదిరిందే!