NTV Telugu Site icon

Mohammed Shami Bail: భారత క్రికెటర్ మహ్మద్ షమీకి బెయిల్ మంజూరు!

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami gets bail in Domestic Violence Case: స్వదేశంలో త్వరలో ఆరంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కు ముందు భారత సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమీకి ఊరట లభించింది. షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్ కోర్టు అతడికి రెండు వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షమీ మంగళవారం కోల్‌కతాలోని అలీపూర్ ఏసీజేఎం కోర్టుకు భౌతికంగా హాజరై బెయిల్ తీసుకున్నాడు. షమీతో పాటు అతని సోదరుడు మహ్మద్‌ హసీమ్‌కు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

2018లో జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మహ్మద్‌ షమీతో పాటు అతడి సోదరుడు మహ్మద్‌ హసీమ్‌పై హసిన్ జహాన్ ఫిర్యాదు చేసింది. షమీ, అతడి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని.. షమీ వివాహేతర సంబంధం కూడా కలిగి ఉన్నాడని జహాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. జహాన్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. షమీ మరియు అతని కుటుంబ సభ్యులలో కొందరిపై కేసు నమోదైంది. ఇక 2019 ఆగస్టు 29న అలీపూర్‌ అడిషినల్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ షమీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. ఇక సెప్టెంబర్‌ 9న కోల్‌కతా కోర్టు ఆ అరెస్ట్ వారెంట్‌పై స్టే విధించింది.

Also Read: Rohit Sharma: అభిమానుల కోసం కారు దిగిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్!

2023 జనవరిలో హసిన్ జహాన్‌కు నెలవారీ పరిహారంగా రూ. 50 వేలు చెల్లించాలని భారత పేసర్ మొహ్మద్ షమీని అలీపూర్ కోర్టు ఆదేశించింది. ఇక షమీపై ఉన్న స్టేను ఎత్తివేయాలని జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హసిన్ ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 23న అలీపూర్ అదనపు సెషన్స్ జడ్జి షమీకి సమన్లు ​​జారీ చేయడం వెనుక సరైన కారణం కనిపించలేదని ఆదేశించారు. ఈ కేసులో సెప్టెంబర్ 19న కోర్టుకు హాజరై బెయిల్ కోసం షమీ దరఖాస్తు చేసుకోగా.. న్యాయమూర్తి పిటిషన్‌ను మన్నించి బెయిల్ మంజూరు చేశారు.