Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Opposes Pakistan Diamer Bhasha Dam Indus River

Diamer Bhasha Dam: సింధూ నదిపై పాక్ ఆనకట్ట.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్

Published Date :September 16, 2025 , 7:29 pm
By Shiva Ganesh
Diamer Bhasha Dam: సింధూ నదిపై పాక్ ఆనకట్ట.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Diamer Bhasha Dam: పాకిస్థాన్‌ తన దేశంలో ఉన్న అపారమైన నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే నీటికి కటకటలాడే పరిస్థితులు తలెత్తవు. ఈ నీటి వనరులను సరిగ్గా ఉపయోగించుకుంటే చౌకైన విద్యుత్ ఉత్పత్తి, బంజరు భూములను సాగు భూములుగా మార్చడం జరిగేవి. సరైన నీటి వనరులు ఉన్నప్పటి కూడా వాటి నిర్వహణలో పాకిస్థాన్ నిర్లక్ష్య విధానం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తాజాగా పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సింధు నదిపై నిర్మించనున్న డైమర్-భాషా ఆనకట్ట దేశంలో నీటి సమస్యను తీర్చడంలో ఆశాకిరణంగా మారింది. కానీ ఈ ఆనకట్ట పనుల పురోగతికి అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అది ఏ విధంగా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Ayyanna Patrudu: అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? ఎమ్మెల్యేలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా?

స్థానికుల నుంచి నిరసనలు..
కోహిస్తాన్‌లోని హర్బన్ అనే గ్రామస్థులు డైమర్-భాషా ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆనకట్ట కోసం సేకరించిన భూమికి పరిహారం, స్థానిక ప్రజలకు పునరావాసంపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. గత వారం రోజులుగా హర్బన్ గ్రామస్థులు గిల్గిట్-బాల్టిస్థాన్‌ను ఖైబర్-పఖ్తుంఖ్వాకు అనుసంధానించే హర్బన్ నాలా వద్ద కారకోరం హైవేను దిగ్బంధించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. రహదారి దిగ్బంధంతో వందలాది ట్రక్కులు, ప్రయాణీకుల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాణిజ్యం, ప్రజల ప్రయాణం పూర్తిగా నిలిచిపోయాయి. ఈసందర్భంగా నిరసనకారుల నాయకుడు నియామత్ ఖాన్ మాట్లాడుతూ.. తమ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, పరిహారం చెల్లించడానికి ఆలస్యం చేశారని విమర్శించారు. చెల్లింపు హామీలను నెరవేర్చడంలో వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ (WAPDA), ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విఫలమయ్యాయని నిరసనకారులు విమర్శించారు. పలు నివేదికల ప్రకారం.. భూ యజమానులకు దాదాపు PKR 3 బిలియన్లు బాకీ ఉన్నారు. ఇందులో దాదాపు PKR 2 బిలియన్లు ఇప్పటికే కోహిస్థాన్ డిప్యూటీ కమిషనర్ ఖాతాలో జమ చేశారు. మిగిలిన మొత్తం అవసరమైన చట్టపరమైన లాంఛనాల కారణంగా పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు. నిరసనకారులు ఈ వివరణలను తిరస్కరించారు. సంవత్సరాలుగా జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

2020లో ప్రారంభం అయిన పనులు..
2020లో గత ప్రభుత్వ హయాంలో ఈ ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే పాక్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అనే ముఖ్యమైన అంశాన్ని పరిష్కరించకుండా త్వరితంగా నిర్మాణాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీవ్రమైన సవాళ్లకు దారితీసింది. ఆనకట్ట ఖర్చును మొదట్లో రూ.479 బిలియన్లుగా అంచనా వేశారు. ఇందులో రూ.120 బిలియన్లు భూసేకరణకు మాత్రమే కేటాయించారు. నేడు ఆ ఖర్చు రూ.1,400 బిలియన్లకు పెరిగింది. ఈ ఖర్చుల పెరుగుదల పేలవమైన ప్రణాళిక, విస్తృత నమూనాను ప్రతిబింబిస్తుందని, జాప్యం, అనవసరమైన అధికార అడ్డంకులు, ఇతర కారణాలు ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచాయని చెబుతున్నారు.

ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న భారత్..
ఈ ఆనకట్టను భారతదేశంలోని ఒక ప్రాంతమైన గిల్గిట్-బాల్టిస్థాన్‌లో నిర్మిస్తున్న కారణంగా దీనిని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిల్గిట్-బాల్టిస్థాన్ పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగం. నిర్మాణ పనులను కొనసాగించాలనే పాకిస్థాన్ నిర్ణయం భారతదేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని న్యూఢిల్లీ పదే పదే చెబుతోంది.

READ ALSO: Telusu Kada: ‘తెలుసు కదా’ ముగించేసిన సిద్దు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Diamer Bhasha Dam
  • Gilgit-Baltistan dispute
  • India opposes dam
  • Indus River dam
  • Indus waters

తాజావార్తలు

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions