NTV Telugu Site icon

IND vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు!

India Cwc 2023

India Cwc 2023

India ICC ODI World Cup Record: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ ఈ రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ (58)ను భారత్ అధిగమించింది. నిన్నటివరకు 58 విజయాలతో భారత్, న్యూజిలాండ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.

వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. వన్డే ప్రపంచకప్‌లలో ఆసీస్ 73 విజయాలు సాధించింది. భారత్ రెండో స్థానంలో ఉండగా.. న్యూజిల్యాండ్ మూడో స్థాయికి పడిపోయింది. ఇక మెగా టోర్నీ హిస్టరీలో పాకిస్తాన్ 47 విజయాలు నమోదు చేయగా.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సంయుక్తంగా 43 మ్యాచుల్లో గెలిచాయి. వన్డే ప్రపంచకప్‌ 2023లో వరుసగా ఆరు విజయాలు నమోదు చేసిన భారత్.. న్యూజిల్యాండ్‌ను వెనక్కి నెట్టింది.

Also Read: Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫాన్స్ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్!

వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో 65.56 విజయాలు పర్సంటేజీ ఉన్న భారత్ అత్యధిక విజయాల శాతం ఉన్న జట్లలో కూడా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో 75 శాతం విజయాలతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 61.43 శాతంతో మూడో స్థానంలో ఉంది. వన్డే ప్రపంచకప్‌లలో 2003 నుంచి ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2003, 2007, 2015 వన్డే ప్రపంచకప్‌లను ఆసీస్ కైవసం చేసుకుంది. దాంతో ఆ జట్టు ఖాతాలో అత్యధిక విజయాలు చేరాయి. ఆస్ట్రేలియాను అందుకోవాలంటే.. భారత్ చాలా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.