NTV Telugu Site icon

Meenakshi Lekhi: స్లోగన్స్ చేయకపోతే వెళ్లిపోండి.. యువతపై కేంద్ర మంత్రి ఫైర్

Centrl Minister

Centrl Minister

కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి (Meenakshi Lekhi) కేరళలో చేదు అనుభవం ఎదురైంది. కోజికోడ్‌లో జరిగిన యువజన సదస్సులో ఆమె సహనం కోల్పోయారు. ప్రసంగం ముగింపులో ఆమె.. భారత్ మాతా కీ జై (bharat mata ki jai) అంటూ నివాదం చేశారు. కానీ ఆడియెన్స్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. దీంతో ఒకింత కోపానికి గురయ్యారు. ఓ మహిళను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరారు. ఇండియా (India) పట్ల గౌరవం లేనివారు యూత్ కాంక్లేవ్‌లో ఉండనవసరం లేదంటూ తెగేసిచెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.

కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం కేరళలో (Kerala) పర్యటించారు. కోజికోడ్‌లో కొన్ని రైట్-వింగ్ సంస్థలు యువజన సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి.. ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేయాలని ఆడియెన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో ఆమె పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళను నిలదీశారు. ‘భారత్ మాతా కీ జై’ అనడం ఇబ్బందిగా అనిపిస్తే సదస్సు నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ‘భారత్ (మాత) మీ తల్లి కాదా?’ అని ఆమెను సూటిగా ప్రశ్నించారు. మీరు సభ నుంచి వెళ్లిపోవడమే సరైనదని ఆమెకు సూచించారు. దేశాన్ని గర్వంగా చెప్పుకోలేని వారు, ఇండియా గురించి మాట్లాడటానికి వెనుకాడే వాళ్లు యువజన సదస్సులో ఉండాల్సిన అవసరం లేదని సూచించారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి:Sharathulu Varthisthayi Teaser: చిరంజీవి, విజయశాంతిల ప్రేమ కథ.. షరతులు వర్తిస్తాయి