న్యూజిలాండ్ జట్టు వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో పర్యటించనుంది. రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 18 న జరుగుతుంది. టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. చివరి టీ20 మ్యాచ్ జనవరి 31 న జరుగుతుంది.పిటిఐ నివేదిక ప్రకారం, వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జనవరి 11న హైదరాబాద్‌లో, రెండవ మ్యాచ్ జనవరి 14న రాజ్‌కోట్‌లో, చివరి మ్యాచ్ జనవరి 18న ఇండోర్‌లో జరుగుతాయి. దీని తర్వాత, మొదటి టి20 జనవరి 21న నాగ్‌పూర్‌లో, రెండవ మ్యాచ్ జనవరి 23న రాంచీలో, మూడవ మ్యాచ్ జనవరి 25న గౌహతిలో, నాల్గవ మ్యాచ్ జనవరి 28న విశాఖపట్నంలో, చివరి టి20 మ్యాచ్ జనవరి 31న త్రివేండ్రంలో జరుగుతాయి.
Also Read:Mallikarjun Kharge: విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.. ఖర్గే డిమాండ్
భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్
మొదటి వన్డే: జనవరి 11, హైదరాబాద్
రెండవ వన్డే: జనవరి 14, రాజ్‌కోట్
మూడో వన్డే: జనవరి 18, ఇండోర్
Also Read:AP DSC: ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా.. కారణం ఏంటంటే?
ఇండియా vs న్యూజిలాండ్ T20 సిరీస్
మొదటి టీ20: జనవరి 21, నాగ్‌పూర్
రెండవ టీ20: జనవరి 23, రాంచీ
3వ T20: జనవరి 25, గౌహతి
4వ టీ20: జనవరి 28, విశాఖపట్నం
5వ T20: జనవరి 31, త్రివేండ్రం
