భారత్-బంగ్లాదేశ్ మధ్య ఢిల్లీలో రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 222 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత్ ఇన్నింగ్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి అత్యధికంగా (74) పరుగులు చేశాడు. 34 బంతుల్లో 74 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. నితిష్ క్రీజులో ఉన్నంత సేపు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాను ఆడుతున్న రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌లో రింకు సింగ్ కూడా అర్ధ సెంచరీతో (53) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 29 బంతుల్లో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ (15), సంజూ శాంసన్ (10), సూర్య కుమార్ యాదవ్ (8), హార్ధిక్ పాండ్యా (32), రియాన్ పరాగ్ (15), అర్ష్‌దీప్ సింగ్ (6) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. ముస్తాఫిజుర్ రెహమన్ 2 టస్కిన్ అహ్మద్ 2, తంజీమ్ హసన్ 2 వికెట్లు తీశారు.
IND vs BAN: దంచికొట్టిన తెలుగు కుర్రాడు.. భారత్ భారీ స్కోరు
- భారీ స్కోరు చేసిన భారత్
- 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసిన టీమిండియా
- బంగ్లాదేశ్ టార్గెట్ 222 పరుగులు.
Show comments