NTV Telugu Site icon

India Lockdown: ఇండియా లాక్‌డౌన్‌.. ఏమైంది?

India Lockdown

India Lockdown

India Lockdown: కరోనా అనే పేరు వినపడితేనే యావత్ ప్రపంచం వణికిపోయిన రోజులున్నాయి. ఎంతో మంది ఆత్మీయులను, ఆప్తులను పొట్టన పెట్టుకుని దేశంలో ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది ఈ మహమ్మారి. ఇంకా ఇప్పటికీ కరోనా అంటే వణికిపోతున్నారు. ఎంతలా అంటే లాక్‌డౌన్‌ అని పేరు వింటేనే.. ఏంటీ మళ్లీ లాక్‌డౌనా? అంటూ భయపడిపోతున్నారు. మళ్లీ ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ట్విటర్‌లో ‘ఇండియా లాక్‌డౌన్‌’ యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. ‘ఇండియా లాక్‌డౌన్’ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరో కొవిడ్‌ వేవ్‌ వస్తోందా అంటూ చాలా మందిలో భయం నెలకొంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియాలో మళ్లీ లాక్‌డౌనా? అంటూ భయపడిపోతున్నారు. అసలు విషయం తెలిశాకా హమ్మయ్యా.. అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. అది సినిమా పేరు అని తెలిశాకా.. రిలాక్స్ అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అవును నిజమేనండి.. ‘ఇండియా లాక్‌డౌన్‌’ అనే టైటిల్‌తో దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో సినిమా వస్తోంది. గతంలోని కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలోని లాక్‌డౌన్‌ పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ‘ఇండియా లాక్‌డౌన్‌’ పేరిట పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Elon Musk Twitter: ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం..! ట్విట్టర్‌ ఖాతా ఉంటే డబ్బు కట్టాల్సిందే..!

కరోనా నాటి పరిస్థితులను ప్రతిబింబిచేలా వస్తున్న చిత్రం ‘ఇండియన్‌ లాక్‌డౌన్‌’. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వలస కూలీలు అనుభవించిన వేదన, వేశ్యవృత్తి వారిపై కరోనా ప్రభావం లాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ట్రైలర్‌లో చూపించారు. శ్వేత బసు ప్రసాద్‌, ప్రతీక్‌ బబ్బర్‌, సాయి తమంకర్‌, ప్రకాశ్‌ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలకపాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2న స్ట్రీమింగ్‌ కానుంది.