Site icon NTV Telugu

India Jihadi Network: భారత్‌లో జిహాదీ నెట్‌వర్క్.. భారీ ప్లాన్‌ను భగ్నం చేసిన ఏటీఎస్!

Ats Arrests Up

Ats Arrests Up

India Jihadi Network: దేశంలో జిహాది నెట్‌వర్క్ బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. భారత్‌లో జిహాదీ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో చేసిన భారీ ప్లాన్‌ను ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. హింసాత్మక జిహాద్ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి “ముజాహిదీన్ ఆర్మీ” అనే సంస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్న నలుగురు అనుమానితులను ఏటీఎస్ అరెస్టు చేసి ఒక పెద్ద కుట్రను భగ్నం చేసింది. అరెస్టయిన నిందితుల్లో సుల్తాన్‌పూర్‌కు చెందిన అక్మల్ రజా, సోన్‌భద్రకు చెందిన సఫర్ సల్మానీ అలియాస్ అలీ రజావి, కాన్పూర్‌కు చెందిన మొహమ్మద్ తౌసిఫ్, రాంపూర్‌కు చెందిన ఖాసిం అలీ ఉన్నారు.

READ ALSO: Rashmika Mandanna : జిమ్ లో కత్తిలాంటి అందాలకు చెమటలు పట్టిస్తున్న రష్మిక..

సోషల్ మీడియాలో తీవ్రవాదం వ్యాప్తి..
ఈ నలుగురు సోషల్ మీడియా ద్వారా తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అలాగే ముస్లిమేతర మత నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని ATS అనుమానిస్తోంది. నిందితులు రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నారని ATS దర్యాప్తులో తేలింది. వారు సోషల్ మీడియా గ్రూపులలో చేరడం ద్వారా తమ రాడికల్ జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రూపులలో ఆడియో చాట్‌లు, వీడియో క్లిప్‌లు, ప్రచార సందేశాలను పంపడం ద్వారా, వారు ప్రజలను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపిస్తున్నారని చెప్పారు. హింసాత్మక జిహాద్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం, భారతదేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడం వారి ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు. ATS వర్గాల సమాచారం ప్రకారం.. నిందితులు ఒకే ఆలోచన గల యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారని, వారిని ఆ గ్రూపులోకి చేర్చుకుంటున్నారని, దీంతో పెద్ద హింసాత్మక సంస్థను స్థాపించవచ్చని వారి పథకం అని తెలిపాయి.

ఆయుధాల సేకరణకు ప్లాన్..
వీళ్లు ముస్లిమేతర మత నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడానికి పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఏటీఎస్ వర్గాలు పేర్కొన్నాయి. నిందితులు హింసాత్మక జిహాదీ సాహిత్యాన్ని సేకరించి వ్యాప్తి చేస్తున్నారని, ఉగ్రవాద చర్యలకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని సేకరించడానికి వారు నిధులను సేకరించే ప్రక్రియను కూడా ప్రారంభించారని దర్యాప్తు తేలిందని వెల్లడించారు. వారు “ముజాహిదీన్ ఆర్మీ” అనే హింసాత్మక సమూహాన్ని ఏర్పాటు చేయడానికి చురుకుగా సిద్ధమవుతున్నారు. ఈ కుట్ర చాలా నెలలుగా జరుగుతోందని, అరెస్టులకు ముందే 50 మందికి పైగా సభ్యులు ఆ గ్రూపులో చేరారని ATS పేర్కొంది.

నిందితుల అరెస్టు సమయంలో.. ATS వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ATM/డెబిట్/క్రెడిట్ కార్డులు, PhonePe స్కానర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. ఈ వస్తువులను నిధులు, కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ATS త్వరలో నిందితులను కస్టడీలోకి తీసుకుని, మొత్తం నెట్‌వర్క్‌ మూలాల గురించి ఇంటెన్సివ్ ఇంటరాగేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈసందర్భంగా ATS SSP మాట్లాడుతూ.. “రాష్ట్రంలో శాంతికి ఈ అరెస్టు చాలా కీలకం. డిజిటల్ జిహాద్‌కు వ్యతిరేకంగా మేము అప్రమత్తంగా ఉన్నాము” అని చెప్పారు.

READ ALSO: Heart Risks: మీ హృదయం స్పందిస్తుందా.. చిన్న వయస్సులో గుండె పోటుకు కారణాలు ఏంటో తెలుసా?

Exit mobile version