Jobs Growth: ఏఐ, ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన నియామకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jobs Growth: భారతదేశ వైట్-కాలర్ ఉద్యోగ మార్కెట్ ఫిబ్రవరిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. Naukri.com విడుదల చేసిన తాజా Naukri JobSpeak Index నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2026లో నియామకాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. జాబ్‌స్పీక్ ఇండెక్స్ 3,233 పాయింట్లకు చేరుకోగా, గత ఏడాది ఫిబ్రవరిలో ఇది 2,890 పాయింట్లుగా ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నెలవారీ వృద్ధి 23 శాతంగా నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 13–16 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తుందని నివేదిక పేర్కొంది.
ఐటీ రంగం పుంజుకుంది
ఫిబ్రవరి 2026లో ఐటీ రంగంలో నియామకాలు గతంతో పోలిస్తే 6 శాతానికి పైగా పెరిగాయి. ఫ్రెషర్ల నియామకాలు కూడా 8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. భారతీయ బహుళజాతి ఐటీ కంపెనీలు ప్రధాన చోదకశక్తిగా నిలిచాయి. ఈ సంస్థల్లో నియామకాలు 55 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
Also Read
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
- Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
- AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
AI/ML పాత్రలకు భారీ డిమాండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (AI/ML) పాత్రల నియామకాలు గణనీయంగా పెరిగాయి.
– ఐటీ రంగంలో AI/ML నియామకాలు 40 శాతం పెరిగాయి
– మొత్తం మీద AI/ML పాత్రలు 49 శాతం వృద్ధి సాధించాయి
– భారతీయ బహుళజాతి సంస్థలు AI/ML నియామకాలను 82 శాతం పెంచాయి
– విదేశీ MNCలు 43 శాతం పెంపును నమోదు చేశాయి
– ఇది దేశీయ సంస్థలు ఆధునిక సాంకేతికత స్వీకరణలో ముందంజలో ఉన్నాయని సూచిస్తోంది.
ఫ్రెషర్లు, హై-సాలరీ జాబ్స్‌కు డిమాండ్
ఫ్రెషర్ల నియామకాలు ఏటా 17 శాతం పెరిగాయి. రూ. 20 లక్షల వార్షిక వేతన బ్యాండ్‌లో ఉద్యోగాల డిమాండ్ 23 శాతం పెరిగింది. ఇది ఎంట్రీ-లెవల్ మరియు హై-వాల్యూ టాలెంట్ విభాగాల్లో బలాన్ని ప్రతిబింబిస్తోంది. మరోవైపు.. ఐటీయేతర రంగాల్లో కూడా నియామకాలు పెరిగాయి.. భీమా – 28 శాతం, BPO/ITES – 22 శాతం, రియల్ ఎస్టేట్ – 19 శాతం, హాస్పిటాలిటీ/ట్రావెల్ – 15 శాతం, రిటైల్ – 14 శాతం.. ఇలా ఫిబ్రవరి 2026లో భారతీయ MNCలు మొత్తం నియామకాలను 24 శాతం విస్తరించాయి.
నౌక్రీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ ప్రకారం, ఐటీ నియామకాలు అర్థవంతంగా కోలుకుంటున్నాయి. AI ప్రతిభపై పెట్టుబడులు పెరుగుతుండటంతో, కొత్త ఆర్థిక సంవత్సరానికి బలమైన వేగం కనిపిస్తోంది. భారత ఉద్యోగ మార్కెట్లో తిరిగి ఉత్సాహం నెలకొన్నట్లు తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!