NTV Telugu Site icon

Nuclear Weapons: అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటున్న భారత్

India

India

చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్‌హెడ్లను భారత్‌ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇం టర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తాజాగా వెల్లడించింది. చైనా, పాక్‌ నుంచి ముప్పు పెరగటంతో, అణ్వాయుధ సామర్థ్య పెంపుపై భారత్‌ దృష్టిసారించిందని తెలిపింది. తాజా నివేదిక ప్రకారం.. ‘ఇయర్‌బుక్‌ 2023’ను సిప్రి సోమవారం విడుదల చేసింది. ఉ క్రెయిన్‌పై రష్యా యుద్ధం అణు నిరాయుధీకరణపై పెద్ద దెబ్బ కొట్టిందని నివేదికలో అమెరికా శాస్త్రవేత్త హన్స్‌ ఎం క్రిస్టెన్సెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : Tamilnadu CM: మేం అడిగిందేంటి? మీరు చెప్పిందేంటి?

అయితే చైనా అంతటా లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యంతో కూడిన ఆయుధాలపై భారత్ ప్రయోగాలు చెస్తుందని నివేదిక పేర్కొంది. భారతదేశం- పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను విస్తరింపజేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు దేశాలు 2022లో కొత్త రకాల అణు సరఫరా వ్యవస్థను ప్రవేశపెట్టి, అభివృద్ధి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. భారత్ అణ్వాయుధ నిరోధకంపై పాకిస్తాన్ ప్రధానంగా దృష్టి పెట్టింది. భారీ అణ్వాయుధలను తయారు చేయాలని ఇండియా నిర్ణయించుకుంది.

Also Read : Tension in Mahbubabad: మహబూబాబాద్ లో ఉద్రిక్తత.. పోలీసులతో బాధితుల వాగ్వివాదం

భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా మరియు ఇజ్రాయెల్‌తో సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునీకరించడాన్ని కొనసాగిస్తున్నాయని మరియు అనేక కొత్త అణ్వాయుధాలను మోహరించినట్లు నివేదికలో పేర్కొంది. అయితే.. ఈ సంవత్సరం జనవరిలోనే 12 వేల 512 వార్‌హెడ్‌లను తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్లోబల్ ఇన్వెంటరీలో, దాదాపు 9576 సమర్థమైన ఆయుధాలను ఉపయోగించేందుకు నిల్వ చేశారు. గత ఏడాది కంటే 86 ఎక్కువ.. వాటిలో 3844 వార్‌హెడ్‌లు క్షీపణులు.. విమానాలతో మోహరించబడ్డాయి.

Also Read : Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?

భారతదేశం ఇటీవల ఒడిశా తీరంలోని ఒక ద్వీపం నుంచి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్‌ను పరీక్షించింది. క్షిపణి యొక్క మూడు విజయవంతమైన డెవలప్‌మెంటల్ ట్రయల్స్ తర్వాత, సిస్టమ్ యొక్క ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను ధృవీకరిస్తూ నిర్వహించిన మొదటి ప్రీ-ఇండక్షన్ నైట్ లాంచ్ ఇదేనని వార్తా సంస్థ వెల్లడించింది.