NTV Telugu Site icon

First Analog Space Mission: మొట్టమొదటి అనలాగ్ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో

First Analog Space Mission

First Analog Space Mission

First Analog Space Mission: ఇస్రో (ISRO) తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను గురువారం నాడు లేహ్‌లో ప్రారంభించింది. ఇందుకు సంబంధించి.. శుక్రవారం నాడు ఆ మిషన్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకోవడం ద్వారా ఇస్రో ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది. భవిష్యత్తులో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి, అలాగే భూమి బయట విశ్వంలో జీవం కోసం అన్వేషించడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యం. మానవ అంతరిక్షయానం, ఇతర గ్రహ అన్వేషణలో తన సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. త్వరలో అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్న గగన్‌యాన్ కార్యక్రమం కూడా ఇందులో ఉంది.

Also Read: Pawan Kalyan: జగన్నాధపురంలో దీపం పథకం ప్రారంభించిన డిప్యూటీ సీఎం..

అనలాగ్ స్పేస్ మిషన్ సమయంలో, అంతరిక్షంలోకి వెళ్లే ముందు భూమిపై అంతరిక్షం వంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు ఈ మిషన్ రూపొందించబడింది. దీనిలో మొత్తం వాతావరణం స్పేస్ లో ఉండే విధంగా ఉంటుంది. అనలాగ్ స్పేస్ మిషన్ అనేది భూమిపై అంతరిక్షం లాంటి పరిస్థితులు సృష్టించబడిన సాంకేతికత. దీని ద్వారా వ్యోమగాములు ఈ సవాళ్లను ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ మిషన్‌లో ఇస్రో చంద్రుడు, అంగారకుడి ఉపరితలంతో సమానమైన వాతావరణాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ వ్యోమగాములు పరిమిత వనరులతో జీవిస్తారు. ఈ అనలాగ్ స్పేస్ మిషన్.. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఇస్రో, ఆక (AAKA) స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, IIT బాంబే సహకారంతో తయారు చేసారు. దీనికి లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ నుండి మద్దతు లభించింది.