Site icon NTV Telugu

Farmers Loan: అప్పుల ఊబిలో అన్నదాత.. దేశవ్యాప్తంగా రూ.31 లక్షల కోట్ల రుణాలు.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే!

Farmers Loan

Farmers Loan

Farmers Loan: దేశంలో అన్నదాతలపై పెరుగుతున్న అప్పుల భారంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక సమాచారాన్ని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, లోక్‌సభ సభ్యులు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా రైతుల మొత్తం రుణాలు రూ.31,34,807 కోట్లుగా ఉన్నాయి.

READ ALSO: Hyderabad: రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైలు..

వీటిలో..
క్రాప్ లోన్స్ (పంట రుణాలు): రూ. 20.17 లక్షల కోట్లు

టర్మ్ లోన్స్ (దీర్ఘకాలిక రుణాలు): రూ. 11.17 లక్షల కోట్లు

రాష్ట్రాల వారీగా రుణాల వివరాలు..
రైతుల అప్పుల విషయంలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి.

తమిళనాడు: దేశంలోనే అత్యధికంగా రైతుల అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్: రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2025 డిసెంబర్ 31 నాటికి ఏపీ రైతులపై మొత్తం రూ. 3,75,254 కోట్ల అప్పు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో పంట రుణాలు రూ. 2,01,744 కోట్లు కాగా, టర్మ్ లోన్స్ రూ. 1,73,510 కోట్లుగా ఉన్నాయి.

తెలంగాణ: తెలంగాణలో రైతులపై మొత్తం రూ. 1,75,960 కోట్ల అప్పుల భారం ఉందని కేంద్రం తెలిపింది. ఇందులో పంట రుణాలు రూ. 95,167 కోట్లు కాగా, టర్మ్ లోన్స్ రూ. 80,792 కోట్లుగా ఉన్నాయి.

రైతుల రుణభారం పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ భారం అధికంగా ఉన్నట్లు కేంద్రం గణాంకాలు సూచిస్తున్నాయి. అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ రుణాల నుంచి విముక్తి కల్పించే వ్యూహాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Shoaib Akhtar: పీసీబీ పరువు తీసిన షోయబ్ అక్తర్! భారత క్రికెట్ వ్యవస్థకు సలాం అంటూ షాకింగ్ కామెంట్స్..

Exit mobile version