కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటివరకు వాన తగ్గుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా.. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించానున్నారు. లేదంటే.. కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే మ్యాచ్ రద్దు కానుంది. ఈ క్రమంలో సూపర్-8లో టేబుల్ టాపర్ గా ఉన్న టీమిండియా ఫైనల్కు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా గ్రూప్ -1 లో భారత్ టాప్ లో ఉండగా.. గ్రూప్ -2 లో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రెట్కు తోడు.. ఎక్కువ పాయింట్స్తో భారత్ ఫైనల్ చేరనుంది.
IND vs ENG: కాసేపట్లో మ్యాచ్.. కురుస్తున్న వర్షం
- కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్
- ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్
- గయానా స్టేడియం వద్ద కురుస్తున్న వర్షం

Ind Vs Eng