లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు., ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి. అయితే, సయీద్ భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరిగా జాబితాలో ఉన్నారు. అయితే, 2008 ముంబై దాడులలో అతని ప్రమేయం ఉన్నట్లు అమెరికా ఆరోపిస్తూ $10 మిలియన్ల రివార్డును ప్రకటించింది.
Read Also: Hi Nanna: ఈ సినిమా కథ ఒరిజినల్… ఫ్యామిలీని కలిసి నాని అండ్ టీమ్…
ముంబై దాడులకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని పాకిస్థాన్ ను భారత్ పదేపదే డిమాండ్ చేసింది. అయితే భారత్- పాకిస్తాన్ మధ్య అప్పగింత ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియ మరింత క్లిష్టతరం అవుతుంది. అయితే, హఫీజ్ సయూద్ 11 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాడు.
Read Also: IND vs SA: భారత జట్టు నిజంగా అతన్ని మిస్సవుతోంది.. అద్భుతాలు చేసేవాడు!
ఇక, 2019 వరకు హఫీజ్ సయీద్ పాకిస్థాన్ జైల్లోనే ఉన్నాడు. కానీ, అతడు జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి అక్కడి రాజకీయాలను, ఆ దేశ సైన్యాన్ని శాసిస్తున్నాడు. పాకిస్తాన్‌లో 2024 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టెర్రరిస్టు హఫీజ్ సయీద్ పార్టీ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ తరపున పోటీ చేస్తున్నారు అనే ప్రచారం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జాతీయ, ప్రాంతీయ అసెంబ్లీ నియోజకవర్గంలో తన అభ్యర్థులను నిలబెడుతున్నాడు. హఫీజ్ తన కుమారుడు తల్హా సయీద్‌ను కూడా లాహోర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నాడు. అలాగే, హఫీజ్‌తో సంబంధం ఉన్న సంస్థకు చెందిన పలువురు నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.