NTV Telugu Site icon

IND vs ZIM: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. బౌలర్ ఎంట్రీ

Ind Vs Zim

Ind Vs Zim

ఇండియా-జింబాబ్వే మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. అందులో భాగంగా ఈరోజు నాల్గవ టీ20 మ్యాచ్ ఉండనుంది. హరారే వేదికగా ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. జట్టులో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. తుషార్ దేశ్‌పాండే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అవేష్ ఖాన్ స్థానంలో తుషార్‌కు అవకాశం కల్పించారు. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తుండగా, జింబాబ్వే సిరీస్‌ను సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో జింబాబ్వే గెలుపొందగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.

Read Also: Heavy rain warning: తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే ప్లేయింగ్ ఎలెవన్:
వెస్లీ మాధేవేర్, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే (వికెట్), రిచర్డ్ న్గర్వా, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా.

Show comments