NTV Telugu Site icon

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో ఇండియా ‘C’ ఘన విజయం..

Cricket

Cricket

దులీప్ ట్రోఫీలో ఇండియా ‘D’ పై ఇండియా ‘C’ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. భారత్ సి నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. కాగా.. అభిషేక్ పోరెల్ 35 పరుగులతో, మానవ్ సుతార్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రెండో ఇన్నింగ్స్లో ఇండియా ‘సి’ జట్టులో ఆర్యన్ జుయల్ అత్యధికంగా (47) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46), రజత్ పటిదార్ (44), సాయి సుదర్శన్ (22) పరుగులు చేశారు.

Read Also: Actor Darshan: జైల్లో టీవీ కోసం రిక్వెస్ట్.. అంగీకరించిన అధికారులు

ఇండియా ‘డి’ బౌలింగ్ లో సారంశ్ జైన్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇండియా ‘డి’ జట్టు.. 58.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఇండియా ‘డి’ బ్యాటింగ్లో శ్రేయాస్ అయ్యర్ (54), దేవ్దత్ పడిక్కల్ (56), రికీ భుయ్ (44), అక్షర్ పటేల్ (28) పరుగులు చేశారు. ఇండియా ‘సి’ బౌలింగ్ లో మానవ్ సుతార్ అత్యధికంగా 7 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ 2, అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ సంపాదించాడు. మొదటి ఇన్నింగ్స్లో ఇండియా ‘డి’ జట్టు 48.3 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఇండియా ‘సి’ జట్టు 62.2 ఓవర్లలో 168 పరుగులు చేసింది. కాగా.. అనంతపురంలోని ఏసీజీ మైదానంలో దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ మూడు రోజుల పాటు జరిగింది.

Read Also: Maharashtra: “ద్రోహం చేసిన నా కుమార్తె, అల్లుడిని ప్రాణహితలో పారేయండి”.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..