NTV Telugu Site icon

Uddhav Thackeray: మేము 300 సీట్లకు పైగా గెలుస్తాం.. నా పార్టీనే ఒరిజినల్..

Uddav

Uddav

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 300కు పైగా సీట్లను గెలుస్తుందని శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. శివసేన (యూబీటీ) అభ్యర్థి నరేంద్ర ఖేడేకర్ కోసం బుల్దానాలో జరిగిన ర్యాలీలో ఉద్దవ్ ఠాక్రే మాట్లాడారు. తమ పార్టీని నకిలీ శివసేన అంటున్న బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు చెందిన ప్రతాప్ జాదవ్‌తో ఖేడేకర్ ఈసారి పోటీ పడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పాలన, వ్యవసాయ విధానాలపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

Read Also: Piyush Goyal: తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుంది.. రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరు..

కాగా, తనను రాజకీయంగా అంతం చేశామని చెబుతున్న భారతీయ జనతా పార్టీ ప్రతిరోజూ తననే టార్గెట్ చేస్తోందని ఉద్దవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. మీరు నా పార్టీని నకిలీ శివసేన అంటున్నారు.. కానీ, ఇదే సేన మీకు మా బలాన్ని చూపిస్తుందన్నారు. మీలా నకిలీ డిగ్రీ లాంటిదనుకున్నారా.. ఇది నా శివసేన అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన వాఖ్యానించారు. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ నకిలీ శివసేన అంటూ ఇటీవల అభివర్ణించారు. దానికీ ఉద్దవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు.