NTV Telugu Site icon

Rahul Gandhi: సీఎం స్టాలిన్‌కు రాహుల్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..!

Rahul

Rahul

కాంగ్రెస్ అగ్ర రాహుల్‌గాంధీ తమిళనాడులో సందడి చేశారు. చెన్నైలో రోడ్డు పక్కన ఉన్న ఓ స్వీట్ షాపులోకి వెళ్లి స్వీట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్వీట్ బాక్సును నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు. దాన్ని అందుకున్న స్టాలిన్.. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి విక్టరీ సాధించబోతుందని.. జూన్ 4న ఇలాంటి తీపి కబురే దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం..

రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనలో ఉన్నారు. కొయంబత్తూరులో స్టాలిన్‌తో కలిసి రాహుల్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభ అనంతరం శుక్రవారం రాత్రి సింగనల్లూరులోని ఓ మిఠాయి దుకాణానికి రాహుల్‌ వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ కాస్త విరామం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి.. ఓ స్వీట్‌ గిఫ్ట్‌ తీసుకున్నారు. ఆ కానుకను అందుకున్న సీఎం.. రాహుల్‌ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంది. అందులో కాంగ్రెస్‌ నేత రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటి దుకాణానికి వెళ్లారు.

ఇది కూడా చదవండి: Ayesha jhulka: పెంపుడు కుక్క కోసం హైకోర్టుకెళ్లిన బాలీవుడ్ భామ.. అసలేం జరిగిందంటే..!

ఇక రాహుల్‌ను చూసిన షాపు సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏం కావాలి సర్‌? అని అడగ్గా.. మా బ్రదర్‌ స్టాలిన్‌ కోసం మైసూర్‌ పాక్‌ కొనాలని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ సందర్భంగా షాప్‌లోని మిఠాయిలను రాహుల్‌‌కు సిబ్బంది రుచి చూపించారు. అంతేకాకుండా స్వీట్స్ షాపు సిబ్బంది రాహుల్‌తో ఫొటో దిగారు. అనంతరం ఆ స్వీట్లను తీసుకుని స్టాలిన్‌ ఇంటికి వెళ్లి సీఎంకు అందించారు. జూన్ 4న మళ్లీ ఇండియా కూటమి ఇదే తీపికబురు అందుకోబోతుందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.