Site icon NTV Telugu

Narendra Modi: గత 24 ఏళ్లుగా ప్రతిపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయి..

Modi

Modi

PM Modi: ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 1న జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఏడో దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ.. గత 24 ఏళ్లుగా విపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా.. ఈ వ్యక్తులు (ప్రతిపక్షాలు) దుర్వినియోగం చేసేందుకే ఇష్టపడుతారని విమర్శించారు. అలాగే, భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి.. ప్రజాస్వామ్యంలో మాకు శత్రుత్వం లేదన్నారు. దేశ భవిష్యత్తు కోసం నన్ను నేను త్యాగం చేయడానికి మార్గాన్ని ఎంచుకున్నాను అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Read Also: Telangana State Symbol: జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల..

అలాగే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకున్న పీఎం మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ మనుగడ కోసం పోరాడుతోంది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు.. ఆ తర్వాత బెంగాల్ ప్రజలు మమ్మల్ని 80 ఎమ్మెల్యేలకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఈసారి భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం ఏదైనా ఉంటే అది పశ్చిమ బెంగాల్ మాత్రమే.. బెంగాల్‌లో బీజేపీకి అత్యధిక స్థానాలు గెలిచామని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఎన్నికలు ఏకపక్షంగా ఉన్నాయి.. దీంతో టీఎంసీకి చెందిన ప్రజలు కలత చెందుతున్నారు.. ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తలను నిరంతరం జైల్లో పెడుతున్నారని మోడీ ఆరోపించారు.

Exit mobile version