Ind Vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ జయకేతనం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే తడబడింది. రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5), రుతురాజ్ గైక్వాడ్ (18) త్వరగానే వెనుదిరగడంతో భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22) కాసేపు నిలదొక్కుకోగా, అక్షర్ పటేల్ (55 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. చివర్లో మహ్మద్ సిరాజ్ (14 నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ (14) విలువైన పరుగులు జోడించడంతో భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు, జాకబ్ డఫీ 3 వికెట్లు, మాథ్యూ ఫిషర్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read
- Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
- Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
- India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
- WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
210 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, అరంగేట్ర బౌలర్ యశ్ ఠాకూర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31), నిక్ కెల్లీ (24), విల్ యంగ్ (22) పోరాడినా, మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో న్యూజిలాండ్ 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివర్లో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్ (14) కాసేపు ఆడినా.. 47వ ఓవర్లో డఫీని, 49వ ఓవర్ తొలి బంతికి టిక్నర్ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, భారత్ మూడు మ్యాచ్‌లలో నెగ్గి సిరీస్ విజేతగా నిలిచింది.
తాజావార్తలు
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ జయకేతనం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
ట్రెండింగ్
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..