India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..

India Batters Score

India Batters Score

India Batters Score: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ టీమిండియా బ్యాటర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఐదో వన్డేలో ఎట్టకేలకు భారత జట్టు 200 పరుగుల మార్కును దాటింది. అయితే ఈ సిరీస్‌లో తొలిసారి ఆ ఘనత సాధించడానికి కూడా టైలెండర్ల సహాయం అవసరమైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ సింగ్, 11వ స్థానంలో వచ్చిన మహమ్మద్ సిరాజ్ చెరో 14 పరుగులు చేసి జట్టు స్కోరును 209కి చేర్చారు. దీంతో న్యూజిలాండ్ ముందు 210 పరుగుల లక్ష్యం నిలిచింది.

ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో భారత్ ఛేజింగ్ చేసి విజయాలు సాధించింది. ఆ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 200 కంటే తక్కువ లక్ష్యాలను నిర్దేశించింది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 333 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత జట్టు కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. ఐదో వన్డేలోనూ బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ మొత్తం సిరీస్‌లో విరాట్ కోహ్లీ మినహా మరే భారత బ్యాటర్ కూడా 50 పరుగుల మార్కును దాటలేకపోవడం గమనార్హం.

టాప్ స్కోరర్‌గా విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించాడు. తొలి వన్డేలో 74 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లీ.. ఆ తర్వాతి మూడు ఇన్నింగ్స్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 86 పరుగులు మాత్రమే చేశాడు. అంటే తొలి మ్యాచ్‌లోనే 74 పరుగులు చేసిన అతడు.. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 12 పరుగులే సాధించాడు. ఈ జాబితాలో అక్షర్ పటేల్ 74 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న అక్షర్.. ఐదో వన్డేలో 46 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించాడు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఇషాన్ కిషన్ 73 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ఆటగాళ్ల కంటే ఎక్కువ పరుగులు వీరు చేశారు.

మరోవైపు శ్రేయస్ అయ్యర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 67 పరుగులు చేయగా.. నమన్ ధీర్ 60 పరుగులతో టాప్-5లో నిలిచాడు. రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 30 పరుగులే చేశాడు. ఈ గణాంకాలు భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లిస్ట్ లో శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 37 పరుగులు చేయగా, రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 30 పరుగులే సాధించాడు. కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 29 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగులు చేశాడు. బౌలర్ల విషయానికి వస్తే.. అర్ష్‌దీప్ సింగ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 14 పరుగులు చేయగా, మహమ్మద్ సిరాజ్ ఒక ఇన్నింగ్స్‌లో 14 పరుగులు సాధించాడు.