Site icon NTV Telugu

India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు.. కెనడాకు భారత్ వార్నింగ్

Canada

Canada

Khalistani terrorists: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కెనడాను భారత్ హెచ్చరించింది. కెనడా తమ దౌత్య సముదాయాలకు భద్రత కల్పించాలని భారత్ కోరింది. రేపు (జనవరి 26న) కెనడాలోని భారతీయ మిషన్లలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించబడతాయి. ఈ సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉంది.. అందు వల్ల రాయబార కార్యాలయాల దగ్గర భద్రత కల్పించాలని కెనడాకు భారత్ తెలిపింది.

Read Also: Meenaakshi Chaudhary: చీరకట్టులో హొయలు పోయిన మీనాక్షి చౌదరి..!

ఇక, కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. భారత హైకమిషన్ అండ్ కాన్సులేట్‌లకు భద్రత కల్పించాలని మేము కెనడియన్ అధికారులను హెచ్చరించామన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 18న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్)లో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలో ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో ఆరోపణలు చేశాడు. దీంతో జస్టిన్ ట్రూడో ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఈ ఇష్యూతో రెండు దేశాల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటన తర్వాత కెనడాలోని అన్ని మిషన్లలో జాతీయ వేడుకలు, జెండా ఎగురవేత వేడుకలు నిర్వహించడం ఇదే మొదటిసారి.

Read Also: Vangalapudi Anitha: మంత్రి రోజాకు వంగలపూడి అనిత ఓపెన్ ఛాలెంజ్!

అయితే, గత ఏడాది మార్చిలో ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత ఖలిస్తానీలు భారత హైకమిషన్ దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. అప్పటి నుంచి భద్రతపై భారత్ ఆందోళన చెందుతుంది. 2023 మార్చి 23న నిరసనకారులు భారత హైకమిషన్‌పై విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ తర్వాత జూన్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆ నిరసనకు నాయకత్వం వహించినందుకు అమృతపాల్ సింగ్ బావ అమర్‌జోత్ సింగ్‌ను ఛార్జ్ షీట్‌లో నిందితుడిగా చేర్చింది. ఈ దుండగులు హైకమిషన్‌పై పొగ బాంబులు విసిరారు. ఈ ఘటనపై కెనడా పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. అలాగే, నిజ్జర్ హత్య తర్వాత వేర్పాటువాద సమూహం సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) కెనడాలోని భారతీయ అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Exit mobile version