Site icon NTV Telugu

Ind vs SA 2nd Test: తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకే భారత్ ఆలౌట్.. 314 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా

Ind Vs Sa

Ind Vs Sa

భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రెండు రోజుల ఆట పూర్తయింది. నేడు మ్యాచ్‌లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. మూడో రోజు కూడా భారత్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చింది. మూడవ రోజు కూడా, దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ తో అద్భుతం చేసింది. మార్కో జాన్సెన్ మూడవ రోజు మొత్తం 6 వికెట్లు పడగొట్టగా, హార్మర్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు ఆలౌట్ అయింది.

Also Read:Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. రెండు పెళ్లిళ్లు.. ధర్మేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇదే!

దీనికి ముందు, దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. టీమ్‌ఇండియాను ‘ఫాలోఆన్‌’ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు సౌతాఫ్రికా మొగ్గుచూపింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. రిషబ్ పంత్ నేతృత్వంలోని టీమిండియా సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి. కోల్‌కతా టెస్టులో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడి ఉంది.

భారత తొలి ఇన్నింగ్స్‌లో, రెండవ రోజు చివరి సెషన్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ స్థిరంగా బ్యాటింగ్ చేయడంతో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో 6.1 ఓవర్లు మాత్రమే ఆడారు. మూడో రోజు ఆటలో యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారు. రాహుల్, యశస్వి మొదటి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 22 పరుగుల వద్ద కేశవ్ మహారాజ్ చేతికి చిక్కాడు. యశస్వి 85 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన 13వ టెస్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

యశస్వి జైస్వాల్ 58 పరుగుల వద్ద స్పిన్నర్ సైమన్ హార్మర్ చేతిలో వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత హార్మర్ సాయి సుదర్శన్ (15 పరుగులు)ను అవుట్ చేశాడు. భారత జట్టు నాలుగో వికెట్ ధ్రువ్ జురెల్ (0 పరుగులు) రూపంలో పడిపోయింది. కెప్టెన్ రిషబ్ పంత్ (7 పరుగులు) జాన్సెన్ చేతిలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్ షార్ట్ పిచ్ బంతులతో నితీష్ కుమార్ రెడ్డి (10 పరుగులు), రవీంద్ర జడేజా (6 పరుగులు)లను అవుట్ చేశాడు. జడేజా నిష్క్రమించే సమయానికి భారత్ 122/7తో ఉంది. అక్కడి నుంచి వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

Also Read:Thrikala: డిసెంబర్‌లో ‘త్రికాల’ రిలీజ్

సుందర్, కుల్దీప్ యాదవ్ ఎనిమిదో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. సుందర్‌ను సైమన్ హార్మర్ అవుట్ చేశాడు. సుందర్ 92 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ 134 బంతుల్లో 19 పరుగులు చేశాడు, మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జాన్సెన్ బుమ్రా (5 పరుగులు)ను అవుట్ చేసి భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Exit mobile version