భారత ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య పుదుచ్చేరి వేదికగా జరగనున్న సిరీస్ కోసం భారత పురుషుల ఎంపిక కమిటీ బుధవారం ఇండియా ఎ జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో రెండు మల్టీ-డే మ్యాచ్‌లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే ఈ సిరీస్ అక్టోబర్ 11 వరకు సాగనుంది.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ తర్వాత తొడ కండరాల గాయం వల్ల మైదానానికి దూరంగా ఉన్న పాండ్యాను వన్డే జట్టులో చేర్చారు. అయితే ఆయన అందుబాటులో ఉండటం ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ సిరీస్‌లో మల్టీ-డే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. గాయం నుంచి కోలుకున్న సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారు. అలాగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, దేవదత్ పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.
మల్టీ-డే మ్యాచ్‌ల కోసం భారత ఏ జట్టులో అమన్ మోఖడే, ఆయుష్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యష్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, అన్షుల్ కంబోజ్, ప్రఫుల్ హింగే, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), నచికేత్ భుటే, వి వైశాఖ్‌లు ఎంపికయ్యారు.
వన్డే సిరీస్ కోసం భారత ఎ జట్టులో ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), నిషాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), గుర్జాప్‌నీత్ సింగ్, యష్ ఠాకూర్‌లు స్థానం సంపాదించారు.

