Site icon NTV Telugu

IND A Squad Announced: ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియా-ఎ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

Bcci

Bcci

ఐపీఎల్ 2025 శనివారం నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ పర్యటనకు ఇండియా ఎ జట్టును ప్రకటించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మే 16 (శుక్రవారం)న జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో ఇండియా-ఎ జట్టుకు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కరుణ్ నాయర్, ఇషాన్ కిషన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. దేశీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శన ఇచ్చినందుకు కరుణ్ నాయర్‌కు గిఫ్ట్ లభించింది. ఇషాన్ కిషన్ కూడా భారత జట్టు సెటప్‌లోకి తిరిగి వచ్చాడు. ఇండియా-ఎ జట్టు కాంటర్‌బరీ, నార్తాంప్టన్‌లలో ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత భారత ఆటగాళ్ళు తమలో తాము ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడతారు.

Also Read:VI Anand : హనుమాన్ నిర్మాతతో వి.ఐ.ఆనంద్ మల్టీ స్టారర్

బ్యాటింగ్ యూనిట్‌లో యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్ ఉన్నారు. శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ రెండవ మ్యాచ్‌కు ముందు జట్టులో చేరనున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులోకి వచ్చారు. శార్దూల్ ఠాకూర్ కూడా తిరిగి వచ్చాడు.

Also Read:Chiru – Bobby : చిరు – బాబీ సినిమా ఆ బ్యానర్ లోనే

ఇండియా ఎ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్‌), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.

Also Read:Tulbul project: తుల్బుల్ పై మెహబూబా ముఫ్తీ, సీఎం అబ్దుల్లా మధ్య మాటల యుద్ధం.. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఏమిటి?

ఇండియా ఎ ఇంగ్లాండ్ పర్యటన (షెడ్యూల్)

1వ మ్యాచ్: మే 30-జూన్ 2, కాంటర్‌బరీ
2వ మ్యాచ్: జూన్ 6-జూన్ 9, నార్తాంప్టన్
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్: జూన్ 13-జూన్ 16, బెకెన్‌హామ్

Exit mobile version